Saturday, January 1, 2011

veerudu

ఇక్కడ చెప్పేదెవరు వినేదెవరు వెర్రి మొహమేయకు బుర్ర ఖాలీ చేయి

కళ్ళెం లేని గుర్రమెక్కు కదంరంగానికి వదలిపెట్టు ఒంటరిగా పోరిగేల్వు

తారతమ్యం లేకుండా కుత్తుకలు కత్తిరించు

మత్తేభములు వెంతపడినా భీతి చెందకు నువ్వు శూరుడవైతే అవి చీమలవుతాయి

వీరులే అసలైన ముక్తి ప్రదాతలు


నేను ఉన్నాననే భావన నీకు చేయుతనివ్వదు

నువ్వు లేనపుడే అనుభవానికి వస్తుంది

సాక్ష్యం సరళమైనది కాదు, అనుభవమే ఆసరాగ ఉంటుంది

ప్రాధాన్యత ఇచ్చినంతమేర చచ్చుబడిపోతుంది

కట్టుకున్న కోటలన్ని నట్టేతముంచి నర్మగర్భమైన అంకురాన్ని త్రుంచి

జంకు బొంకు లేక నను ఎంచుకో

ఎంత దూరం తిరిగినా ఏముంది సొంత మార్గం తెలియంది

సుఖడుక్ఖ్aalu నీవి కావు, నీవు లేవు నేనున్నా

వాస్తవం తెలిసేదాక వేదన tappadu