Thursday, December 30, 2010

అంతఃచేతన

కారణజన్ములు సత్యతోరణాలు కట్టి నిత్యపారాయణం చేస్తుంటారు 
వీరకంకణం కట్టుకొని రణము నందు ఋణము లేకుండా చేస్తుంటారు 
వీరే దాతలు ప్రదాతలు విశ్వ సంజాతులు 
స్వయం ప్రకాశం చూడండి 
వినయ తారలు విద్యుల్లతల్లా మెరుస్తున్నాయి 
చూసేది కన్నులతో కాదు సుమా! 
భావానికి అందని ఉదయమిది 
మరిచిపోలేని అనుభవాలు గురుతు పెట్టుకోవాలనుకున్టున్నారా! వెంటనే తుడుచివేయండి, అది పోనిదే ఇది రాదు. 
ఎన్ని లోకాలు తిరిగిన నీ నీడ చూడని ఉరుకు అలసట కలిగిస్తుంది 
సత్యమును కనుగొనటం వీలుపడదు 
ఎవరి పరిధి లో వారు పయనిస్తుంటారు 
విశేషమేమీ లేదు సశేషమే, చావు పుట్టుకలు ఉద్దేశాలు కావు నిరంతర సవరణలు 
ధ్యాసంత ఒకే దానిపై వుంచటం మోసమే అవుతుంది మనసు దేనిపై నిలవక పోవటం మరీ మంచిది. ఎందుకనగా పరిశీలనా drishti ఏర్పడుతుంది. 
ఒక్క దానికే పరిమితమైతే యంత్రం లా మొద్దుబారిపోతుంది. లక్ష్యం వలన ఓ పక్షం లో చేరిపోతారు. 
మనసు జాడలు తెలుసుకోకుండా సాధిన్చాననటం తమను తాము వేదిన్చుకోవడమే అవుతుంది. ఇక్కడ పరిపక్వత అంటే తనను తానూ తెలుసుకోవటమే.

No comments: