Sunday, February 24, 2013

martyr


మత శక్తి ఉంది కదా వేరే చదువు ఎందుకు అంటాను

పని లేదు కదా అని బిర్యానీ తింటాను , అరగటానికి అరుస్తాను

మొబైల్ ఉంది కదా అని పక్క వాడి మొహం కూడా చూడను

చెట్టు కి నోరు లేదులే అని నరికేస్తాను 

గోడ చాటున ఉన్నా కదా అని రాళ్ళు విసిరేస్తాను

ఆడది  ఒంటరిగా కనబడితే వెకిలి గా నవ్వి అదే కావాలి అని అడుగుతాను



Saturday, October 8, 2011

HowStuffWorks "Forms of Agritourism"

HowStuffWorks "Forms of Agritourism":

'via Blog this'

I got this link while looking for clues on profitable small scale business for self sustainable villages (as dreamed by Gandhi).

Does it really work ? We do have a beautiful country side. Though it is not too inviting as of now because of the poor sanitation facilities, reluctance to invest on roads and nature homes. Of course it is not a quick money. It surely has that potential to grow which can bring stability and security to our people.

Setting up food processing units seems to be another reasonable option.

Monday, September 5, 2011

Work towards the freedom.
You will know the value of it. Never ever lose it.

Saturday, January 1, 2011

veerudu

ఇక్కడ చెప్పేదెవరు వినేదెవరు వెర్రి మొహమేయకు బుర్ర ఖాలీ చేయి

కళ్ళెం లేని గుర్రమెక్కు కదంరంగానికి వదలిపెట్టు ఒంటరిగా పోరిగేల్వు

తారతమ్యం లేకుండా కుత్తుకలు కత్తిరించు

మత్తేభములు వెంతపడినా భీతి చెందకు నువ్వు శూరుడవైతే అవి చీమలవుతాయి

వీరులే అసలైన ముక్తి ప్రదాతలు


నేను ఉన్నాననే భావన నీకు చేయుతనివ్వదు

నువ్వు లేనపుడే అనుభవానికి వస్తుంది

సాక్ష్యం సరళమైనది కాదు, అనుభవమే ఆసరాగ ఉంటుంది

ప్రాధాన్యత ఇచ్చినంతమేర చచ్చుబడిపోతుంది

కట్టుకున్న కోటలన్ని నట్టేతముంచి నర్మగర్భమైన అంకురాన్ని త్రుంచి

జంకు బొంకు లేక నను ఎంచుకో

ఎంత దూరం తిరిగినా ఏముంది సొంత మార్గం తెలియంది

సుఖడుక్ఖ్aalu నీవి కావు, నీవు లేవు నేనున్నా

వాస్తవం తెలిసేదాక వేదన tappadu

Thursday, December 30, 2010

అంతఃచేతన

కారణజన్ములు సత్యతోరణాలు కట్టి నిత్యపారాయణం చేస్తుంటారు 
వీరకంకణం కట్టుకొని రణము నందు ఋణము లేకుండా చేస్తుంటారు 
వీరే దాతలు ప్రదాతలు విశ్వ సంజాతులు 
స్వయం ప్రకాశం చూడండి 
వినయ తారలు విద్యుల్లతల్లా మెరుస్తున్నాయి 
చూసేది కన్నులతో కాదు సుమా! 
భావానికి అందని ఉదయమిది 
మరిచిపోలేని అనుభవాలు గురుతు పెట్టుకోవాలనుకున్టున్నారా! వెంటనే తుడుచివేయండి, అది పోనిదే ఇది రాదు. 
ఎన్ని లోకాలు తిరిగిన నీ నీడ చూడని ఉరుకు అలసట కలిగిస్తుంది 
సత్యమును కనుగొనటం వీలుపడదు 
ఎవరి పరిధి లో వారు పయనిస్తుంటారు 
విశేషమేమీ లేదు సశేషమే, చావు పుట్టుకలు ఉద్దేశాలు కావు నిరంతర సవరణలు 
ధ్యాసంత ఒకే దానిపై వుంచటం మోసమే అవుతుంది మనసు దేనిపై నిలవక పోవటం మరీ మంచిది. ఎందుకనగా పరిశీలనా drishti ఏర్పడుతుంది. 
ఒక్క దానికే పరిమితమైతే యంత్రం లా మొద్దుబారిపోతుంది. లక్ష్యం వలన ఓ పక్షం లో చేరిపోతారు. 
మనసు జాడలు తెలుసుకోకుండా సాధిన్చాననటం తమను తాము వేదిన్చుకోవడమే అవుతుంది. ఇక్కడ పరిపక్వత అంటే తనను తానూ తెలుసుకోవటమే.

జీవితం

ఇది ఒక తీపి కల, మెరుపు వల కూడా
ఇక్కడ వివరణా లేదు సవరణా లేదు
అభాగ్యులైనవారు స్వభాగ్యం చూచుకోవటమే
ఇదే సూక్ష్మం లోని మోక్షం

Monday, February 19, 2007